విరివిగా మొక్కలు నాటి కోనసీమను కాపాడండి అడ్డాల గోపాలకృష్ణ.

వృక్షో రక్షతి రక్షితః
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ  జిల్లా, అమలాపురం sbstv న్యూస్ ప్రతినిధి  :
ఆకు రాలుతుందని ఇంటి ముందు నీడని చల్లదనాన్ని ఇచ్చే చెట్లని నరికేసినపుడు ఈ ఎండ గుర్తు రాదు. చెట్లని నరికేసి అపార్టుమెంట్లు కట్టినపుడు ఈ ఎండ తీవ్రత  గుర్తుకు  రాదు. పుట్టినరోజు అని వేలాది మంది వందల wishes మాకు wish చేసారని గొప్పగా చెప్తుంటారు.కానీ ఒక్క చెట్టు అయినా పెంచారా !?? కనీసం పుట్టినరోజున ఒక చెట్టు నాటి అది పెంచే బాధ్యత తీసుకుంటే ఇపుడు ఇలా అల్లాడి పోయేవాళ్ళం కాదు కదా.ప్రతి సంవత్సరం ఎండ తీవ్రత పెరగడమే తప్ప తగ్గడం ఉండదు ఇక.ప్రతి ఒక్కరం బాధ్యతగా చెట్లు నాటుదాం వాటిని కాపాడుకుందాం. వృక్షో రక్షతి రక్షితః అని ప్రకృతి ప్రేమికులు, వ్యవసాయ, వృక్ష నిపుణులు అడ్డాల గోపాలకృష్ణ అన్నారు. ఈరోజు అమలాపురం ఎర్ర వంతెన వద్ద గల హోసింగ్ బోర్డు కాలనీ పార్కు వద్ద ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి నట్లయితే మన కోనసీమలో ఇంత ఎండ తీవ్రత ఉండేది కాదని,  ఎపుడు లేనంత ఉష్ణోగ్రతలు ఇపుడు కోనసీమలో కూడా చూస్తున్నామన్నారు. కోనసీమ అంటే పచ్చదనానికి మారుపేరని, అటువంటి కోనసీమలో కూడా విపరీతంగా చెట్లు నరికేశారని వాపోయారు. కనీసం వచ్చే వర్సా కాలంలోనైనా అందరూ బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి నట్లయితే మన కోనసీమను మనం కాపాడుకోవచ్చని ప్రజలంతా స్వచ్చందంగా మొక్కలు నాటాలన్నారు.