అమలాపురం ఏప్రిల్ 2 (sbs tv ప్రతినిధి) : నామినే షన్లు వేసే ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పోటీ చేయదలచిన అభ్యర్థులకు పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. మంగళ వారం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ వారు ఛాంబర్ నందు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నామినేషన్లను దాఖలు చేసే విధానం, వివిధ అనుమతులకు సువిధ యాప్ ద్వారా ధరఖాస్తు చేసే విధానం తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధు లతో నిర్వహించి అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలను నిర్వహిం చేందుకు జిల్లాలో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో కొత్తగా హెూమ్ ఓటింగ్ విధానాన్ని ఎన్నికల కమిషన్ ప్రవేశ పెట్టిందని తెలిపారు. వయసు 85 ఏళ్లు పైబడినవృద్ధులకు, 40శాతం వికలాంగత్వం ఉండి నడవలేని స్థితిలో ఉండి మంచానికే పరిమిత మైన దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటింగ్ను నిర్వహిస్తారన్నారు దివ్యాంగులు తదిత రులు తాము పోలింగ్ కేంద్రానికి చేరుకోవ డానికి ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారులకు దరఖాస్తు స్పెక్ట్రమ్ యాప్ ద్వారా చేసుకుంటే, ఆ సౌకర్యాన్ని కూడా కల్పిస్తారని తెలిపారు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అత్య వసర సేవల ఉద్యోగుల కోసం మే మొదటి వారంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తామన్నారు. అదేవిధంగా ఏప్రిల్ 18 నుండి 22 వరకు ఐదు రోజులపాటు ప్రతి నియోజకవ ర్గంలో ఇంటి నుంచి ఓటింగ్ కొరకు దరఖా స్తు పారం 12 అందించి ఏప్రిల్ 23, 24 తేదీలలో హోమ్ ఓటింగ్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారి అంచనాలు రూపొందిం చి, హోమ్ ఓటింగ్ ప్రక్రియను సూక్ష్మ పరిశీలకులు పర్య వేక్షణలో రహస్య ఓటింగ్ కు భంగం వాటిల్లకుండా పోలింగ్ స్టేషన్ మాదిరిగా పోలింగ్ సిబ్బందితో మే 10వ తేదీలోపు పూర్తి చేయడం జరుగు తుందన్నారు ప్రతి అసెంబ్లీ నియోజ కవర్గంలో సుమారు 100 మంది హోమ్ ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. పార్లమెంటు స్థానం కోసం పాటీ చేసే అభ్యర్థి రూ.95 లక్షలు, అసెంబ్లీ స్థానంలో పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.40 లక్షలు వరకు ఖర్చు చేసుకొనే అవకాశం ఉందన్నారు. దీనికోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల తరువాత నిర్ణీత గడువులోగా ఖర్చుల వివరాలను తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. రేట్ల వివరాలు కూడా అభ్యర్థులకు అందించామని ఆ ప్రకారం అభ్యర్థుల వ్యయ ఖర్చులు లెక్కించడం జరుగుతుందన్నారు
నామినేషన్ దాఖలు చేసే సమయంలో అభ్యర్థులు తమ ఆస్తులు, తమపై నమోదై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను తప్పని సరిగా వెళ్లడించాల్సి ఉందని అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేసే విధానం, నిబంధనలు, జత పరచా ల్సిన పత్రాలు, తదితర అంశా లను వివరించారు. పార్లమెంటుకు పోటీచేసేవారు ఫారమ్ 2 - ఏ, అసెంబ్లీకి పోటీ చేసేవారు ఫారమ్ 2 బి లో దర ఖాస్తు చేయాల్సి ఉంటుం దన్నారు. వీటితోపాటు పూర్తి వివరాలతో అఫడవిట్ను సమర్పించాలన్నారు. మొత్తం నామి నేషన్ పత్రం ఆరు విభాగాలుగా ఉంటుందన్నారు.మూడో భాగంలో అభ్యర్థి తమపై ఉన్న కేసులు వివరాలను సమర్పించాలన్నారు. జాతీయ నాయకుల జయంతులు పార్టీ బ్యానర్లు, జెండాలు, కండువాలు లేకుండా పార్టీలకు అతీతంగా నిర్వహించుకో వాలని సూచించారు. ఎపిక్ కార్డులు ఆలస్యంగా రావ డంతో ఈ నెలాఖరు లోగా వాటి పంపిణీ పూర్తి చేస్తామన్నారు. ఈ నెల నాలుగో తేదీన రాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి 7 అసెం బ్లీ నియోజక వర్గానికి పోలింగ్ సిబ్బందిని కేటాయించి తదుపరి శిక్షణ కార్యక్రమాలు అసెంబ్లీ ఆర్వో స్థాయిలో ఉంటాయ న్నారు.ఈ కేసులకు సంబంధించి నిర్ణీత గడువులోగా పత్రికలు లేదా టివీల్లో ప్రముఖంగా కనిపించే విధంగా 3 సార్లు ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు.పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి రూ.25వేలను, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి రూ. 10వేలను ధరావతు చెల్లించాల్సి ఉందన్నారు. ఎస్సి. ఎస్టి అభ్యర్థులు దీనిలో 50 శాతం చెల్లిస్తే సరిపోతుం దని, కుల దృవీకరణ పత్రం జత చేయాలని సూచించారు. గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధు లకు నామినేషన్ల దాఖలు తుది గడువులోగా బి-ఫారాలను అందజే యాల్సి ఉంటుందని, లేదంటే సదరు అభ్యర్థులను స్వతంత్రులుగానే పరిగణించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రాష్ట్రంలో ఎక్కడైనా ఓటరుగా నమోదై ఉండాలని చెప్పారు. సంబంధిత ఓటరు జాబితా కాపీని ధృవపరిచి జతచేయాల్సి ఉంటుందన్నారు. ఒక అభ్యర్థి ఒక ఎన్నికల్లో గరిష్టంగా రెండు చోట్ల మాత్రమే పోటీ చేసే అవకాశం ఉందన్నారు. బ్యాలెట్ పత్రాలపై సంతకాలు ముద్రించడం కోసం, అభ్యర్థులు ఎటువంటి రాజకీయ గుర్తులు లేని తమ ఫోటోను జత చేయాల్సి ఉంద న్నారు. నామినేషన్ పత్రాలను మాత్రం భౌతికంగానే దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ తరఫున యార్లగడ్డ రవీంద్ర, బిజెపి తరఫున దూరి రాజేష్, తెలుగు దేశం తరఫున అల్లాడి స్వామి నాయుడు, వైయ స్సార్సీపి తరఫున సంసాని నాని, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రవీణ్ బహుజన సమాజ్ పార్టీ తరపున కేఎస్ఎల్ భవాని సిపిఎం తరపున కారం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.