పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికలు -2024కు నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా
April 17, 2024
అమలాపురం ఏప్రిల్ 17 sbs tv న్యూస్ ప్రతినిధి : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 18 వ తేదీ నుండి పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికలు -2024 కు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు.. అదేవిధంగా అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయాలలో నామినేషన్లు స్వీకరించడo జరుగుతుందన్నారు. కోనసీమ జిల్లాలో కొత్తపేట, పి. గన్నవరం, అమలాపురం ముమ్మిడివరం, రాజోలు, రామచంద్రపురం , మండపేట ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల లోనూ, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టరేట్లోని ఆర్వో కార్యాలయం లో నామినేషన్ల స్వీకరిస్తారన్నారు. నామినేషన్ల స్వీకరణకు గెజిట్ నోటిఫికేషన్ను ఈనెల 18 న విడుదల చేస్తారన్నారు. ఈనెల 18 నుంచి 25 వరకు ప్రభుత్వ సెలవులు మినహాయించి కార్యాలయ పని వేళ్లలో ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈనెల 26న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిర్వహిచడం జరుగుతుందన్నారు. 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం అభ్యర్థులకు ఉందన్నారు. ఉపసంహరణ అనంతరం పోటిలో నిలిచిన అభ్యర్థులను తుది జాబితా ప్రకటిస్తామన్నారు. మే 12న పోలిం గ్ సిబ్బందికి ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, స్టేషనర్ ఇతర పోలింగ్ సామాగ్రి అందజేసి, ముందుగా నిర్ణయించిన రూట్ మ్యాప్ మేరకు ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బం దిని వాహనాల్లో తరలించనున్నట్లు ఆయన తెలిపారు. మే 13న పోలింగ్ ప్రక్రియ జరుగుతుంద న్నారు. జిల్లాలో గతంలో కన్న ఓటింగ్ శాతం పెంపే ప్రధాన లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోoదని తెలి పారు. ఏపిక్ కార్డుతో పాటు 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి గుర్తింపుగా చూపించి ఓటు హక్కు ను సద్వినియోగం చేసుకొని వచ్చినన్నారు.ఎన్నికల సంఘం పోలింగ్ ప్రెస్ & వీడియో కవరేట్ విధులలో నిమగ్నమై వుండి గుర్తిం పు పత్రాలుగల పాత్రికేయులకు కూడా పోస్టల్ బ్యారెట్ ఓటింగ్ సౌలభ్యం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాల ఏర్పాట్లుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుజిల్లా కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇస్తున్న కేంద్రాల్లో ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు విని యోగించుకునేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, జనం రద్దీగల బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మొదల్కెన ప్రాంతాల్లో ఓటర్ అవగాహన కార్యక్ర మాలు చేపట్టడం జరుగుతోందన్నా రు. జిల్లాలో ఓటింగ్ శాతం పెంచ డమే లక్ష్యంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా నగదు, మద్యం, గిఫ్ట్ ఆర్టికల్స్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకై తనిఖీలు నిర్విస్తున్నామన్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తుంటే ఆధారాలు తప్పనిసరిగా చూపాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో చెక్ పోస్టులతోపాటు ఎస్ ఎస్టి, ఫ్లయింగ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు పేర్కొన్నారు. జిల్లాలో ప్రశాంత వాతా వరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడు తున్నట్లు తెలిపారు.